ఉద్యమాలను అణచివేసిన చరిత్ర ఉన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ్యాధికారం కోసం ఉద్యమం చేస్తే ఎవరు నమ్ముతారు? తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వ్యాఖ్యనించారు. సోమవారం హైదరాబాద్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్ కుమార్,శానంపూడి సైదిరెడ్డి ,బొల్లం మల్లయ్య యాదవ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ.. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు అమలుకు 500 కోట్ల రూపాయల విడుదలకు జీవో విడుదల చేసిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలపారు.
నిన్న నల్లగొండలో బీఎస్పీ సభలో రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పలు వ్యాఖ్యలు చేశారు. అసలు రాజ్యాధికారం అంటే ప్రవీణ్ కు తెలుసా ?అవగాహన ఉందా ? ప్రశ్నించారు. ఉస్మానియ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేసిన ప్రవీణ్ కుమార్ ఈ రోజు రాజ్యాధికారం గురించి మాట్లాడుతున్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం తెలంగాణను నిలబెట్టిన కెసిఆర్ నా ప్రవీణ్ తిట్టేది. ఉద్యమాన్ని అణచి వేసిన ప్రవీణా, తెలంగాణలో అధికారం గురించి మాట్లాడేది అని ద్వజమెత్తారు.
ఏనుగు ఎక్కి ప్రగతి భవన్ వెళ్తావా ?..ఏనుగు మీద ఎంతమంది పడతారు ?..నిన్న నల్లగొండ మీటింగ్‌కు ఏనుగు ఎక్కే వెళ్ళావా ? అని ఎద్దేవ చేశారు. అసలు బీఎస్పీ సిద్ధాంతం ఏమిటో తెలుసా ?..యూపీలో బీఎస్పీ ఇప్పుడెలా నడుస్తోందా తెలుసా ?అక్కడ బ్రాహ్మణుడు బీఎస్పి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రవీణ్ బీజేపీపై ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకు ?.. బీజేపీ బెదిరింపులకు భయపడే ప్రవీణ్ ఐపీఎస్‌కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు మోడీకి ,బీజేపీకి భయపడి వాళ్ళ మీద మాట్లాడటం లేదని ఎమ్మెల్యే విమర్శించారు.
కెసిఆర్ ప్రోత్సహించడం వల్లే ప్రవీణ్ గురుకులాల్లో రాణించారు. కెసిఆర్ ఎపుడూ డబ్బా కొట్టుకోలేదు, అంతా తన వల్లే అన్నటుగా ప్రవీణ్ డబ్బా కొట్టుకున్నారు. బలమైన ప్రాంతీయ పార్టీ లను విచ్చిన్నం చేయడం బీజేపీ పని.. బీజేపీ కుట్రలో ప్రవీణ్ పావుగా మారొద్దు. ఇంత సభ పెట్టి కేంద్రాన్ని ఎందుకు పల్లెత్తు మాట అనలేదు. అందరికీ కెసిఆర్ ను తిట్టడం పనిగా మారిపోయింది. ఏ పార్టీ లోనైనా ప్రవీణ్ చేరొచ్చు, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుదరదు. దళిత బంధును ఎందుకు వ్యతిరేకిస్తున్నావ్, దళితులు బాగుపడటం ఇష్టం లేదా ?..ఐపీఎస్,ఐఏఎస్ లు ఇంతకు ముందు కూడా పార్టీలు పెట్టారు, ఏమయ్యింది ? అని ప్రశ్నించారు.
ప్రగతి భవన్ కు సుస్థిరంగా వెళ్ళేది కారు మాత్రమే, ఏనుగు కాదు. ఏ ఎన్నిక జరిగినా గెలిచేది కారు మాత్రమే.. ప్రభుత్వం ఆలోచనలను ప్రవీణ్ ఆచరణలో పెట్టిన అధికారి మాత్రమే.సొంత డబ్బులు ఎపుడూ ఖర్చు చేయని బాపతు ప్రవీణ్ కుమార్ ది. ప్రవీణ్ భాష మార్చుకోకపోతే మేము కూడా మరింత తీవ్రంగా స్పందిస్తాం. మేధావి ముసుగులో దళితులకు అన్యాయం చేయొద్దు. మాయావతి యూపీలో ఏమేం చేసి అధికారాన్ని కోల్పోయిందో అందరికీ తెలుసు. అంబెడ్కర్ విగ్రహాలు పెట్టకుండా తన విగ్రహాలు పెట్టిన నాయకురాలు మాయావతి అని ఎమ్మెల్యే కిషోర్ గుర్తు చేశారు.
కెసిఆర్ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు..ఆయనపై వాడే భాష విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంద్రవెల్లిలో ఆదివాసీలను పొలిసు కాల్పుల్లో చంపించిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు అక్కడ సభ పెట్టి నాటక మాడుతోంది. దళిత బంధు దశల వారీగా అమలవుతుంది. ఎమ్మెల్యేలను రాజీనామా చేయమనడం అర్థరహితం.పీఎం మోడీ అన్నింటా విఫలమయ్యారు..ఆయన రాజీనామాను కూడా డిమాండ్ చేయమనండి. ఉద్యమాలను అణచి వేసిన చరిత్ర ఉన్న ప్రవీణ్ రాజ్యాధికారం కోసం ఉద్యమం చేస్తే ఎవరు నమ్ముతారు ? ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ అన్నారు.