సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం సర్కారువారి పాట
. భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి మహేశ్ పుట్టినరోజు(ఆగస్ట్ 9) సందర్భంగా సర్కారువారి పాట
బ్లాస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
మైండ్ బ్లోయింగ్‌గా ఉన్న ఈ బ్లాస్టర్ విడుదలతో సినిమాపై ఉన్న భారీ అంచనాలు ఆకాశాన్నంటాయి. మహేశ్ లగ్జరీ కారు నుంచి బయటకు రావడం, విలన్స్‌తో పంచ్ డైలాగ్స్ మాట్లాడటం, వారిని చితక్కొట్టడం వంటి సన్నివేశాలున్నాయి. ఇక మహేశ్ లుక్ చాలా స్టైలిష్‌గా ఉంది. చెవి పోగు, పొడవాటి జుట్టు, చెవి వెనుకభాగాన రూపాయి బిళ్ల టాటూ.. ఇలా ట్రెండీ ఔట్ఫిట్తో మహేశ్ మెస్మరైజింగ్ లుక్స్‌తో కనిపిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించాడు. అమేజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో బ్లాస్టర్ ఎక్స్‌పీరియెన్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు. ఇక ఫ్యాన్స్ చేసుకుంటున్న సెలబ్రేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సూపర్‌స్టార్ స్వాగ్, స్టైల్, లొకేషన్, లగ్జరీ కారు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మహేశ్ అందాన్ని చూసి ప్రేక్షకులు ఎలా ముగ్దులవుతున్నారో, బ్లాస్టర్‌లో హీరోయిన్ కీర్తిసురేశ్ కూడా అలాగే ఫీలైంది. వెన్నెల కిశోర్ పాత్రతో సినిమాలో నవ్వులకు కొదవుండదని టీజర్లో టచ్ ఇస్తూ టీజర్ చివరలో మహేశ్ తనదైన ట్రేడ్ మార్క్ స్టైల్లో వేసిన కామెడీ పంచ్ ప్రేక్షకాభిమానులను ఆనందంలో ముంచెత్తింది.
మది కెమెరావర్క్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ప్రతి ఫ్రేమ్ గ్రాండియర్‌గా, ప్రొడక్షన్ వేల్యూస్ రిచెనెస్ను పెంచేలా ఉంది. సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 13న విడుదలవుతుందని బ్లాస్టర్‌లో కన్ఫర్మ్ చేశారు. తప్పకుండా సంక్రాంతి పండుగకు పర్ఫెక్ట్ సినిమా ఇదని బ్లాస్టర్‌తో తెలియజేశారు మేకర్స్.
సర్కారువారి పాట
ను పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీత సారధ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి ఆర్.మది సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మార్తాండ్ కె.వెంకటేశ్ ఎడిటర్. ఎ.ఎస్.ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది.
నటీనటులు:
మహేశ్, కీర్తి సురేశ్, వెన్నెలకిషోర్, సుబ్బరాజు తదితరులు
సాంకేతిక వర్గం:
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: పరశురాం పెట్ల
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట
బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్
మ్యూజిక్: ఎస్.ఎస్.తమన్
సినిమాటోగ్రఫీ: ఆర్.మది
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేశ్
ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్.ప్రకాశ్
ఫైట్స్: రామ్ లక్ష్మణ్
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్
సి.ఇ.ఓ: చెర్రీ
వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్: యుగంధర్