‘న‌మః శివాయ‌’ను ఆవిష్క‌రించిన న‌ట‌సింహ బాల‌కృష్ణ‌..

200
nbk
- Advertisement -

నాట్యం అంటే ఓ క‌థ‌ను డాన్స్ ద్వారా అంద‌మైన రూపంలో చెప్ప‌డ‌మే. అలాంటి ఓ కాన్సెప్ట్‌తో రూపొందిన ఓ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధమ‌వుతుంది. ఈ నాట్యం చిత్రం ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాపర్‌గా, ప్రొడక్ష‌న్ డిజైన‌ర్‌గా, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆమె త‌న డాన్స్‌, హావ‌భావాలు, న‌ట‌న‌ను అద్భుతంగా పండించారు. ఈ సినిమాలో తొలి సాంగ్ నమః శివాయ‌ను శుక్ర‌వారం రోజున న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న, సంధ్యారాజు, ద‌ర్శ‌కుడు రేవంత్ కోరుకొండ‌, యాక్ట‌ర్ క‌మ‌ల్ కామ‌రాజ్ త‌దిత‌రులు నాట్యం సినిమా కోసం ప‌డ్డ క‌ష్టం అసాధార‌ణ‌మ‌ని.. ఇలాంటి ఓ వైవిధ్య‌మైన సినిమాను పాట‌ల‌ను ఈ జ‌న‌రేష‌న్‌కు అందించ‌డం గొప్ప విష‌యమ‌ని ప్ర‌శంసించారు.

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ.. న‌టి, నిర్మాత సంధ్యారాజుగారిని, ద‌ర్శ‌కుడు రేవంత్ కోరుకొండ‌గారిని, అలాగే నా సోద‌రుడు క‌మ‌ల్ కామ‌రాజుని నాట్యం వంటి సినిమా చేసినందుకు అభినందిస్తున్నాను. ఈ సినిమాలో న‌మః శివాయ‌ అనే పాట‌ను విడుద‌ల చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న హిందూపుర నియోజ‌క వ‌ర్గంలోని లేపాక్షి ఆల‌యంలోనే ఈ పాట‌ను చిత్రీక‌రించారు. భార‌త‌దేశం క‌ళ‌ల‌కు కాణాచి. ఎన్నో క‌ళ‌ల‌కు సంబంధించి గొప్ప గొప్ప క‌ళాకారులంద‌రూ మ‌న దేశానికి వ‌న్నె తెచ్చారు. ఇక నాట్యం సినిమా విష‌యానికి వ‌స్తే, రేవంత్ కోరుకొండ‌గారు రైట‌ర్‌గా, ద‌ర్శ‌కుడిగా సినిమా చేయ‌డ‌మే కాకుండా కెమెరావర్క్‌, ఎడిటింగ్ బాధ్య‌త‌ల‌ను కూడా ఆయనే నిర్వ‌హించ‌డం గొప్ప విష‌యం. ఇప్పుడు విడుద‌ల చేసిన పాట చాలా అద్భుతంగా ఉంది. అన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్న ఈ చిత్రం క‌చ్చితంగా పెద్ద విజ‌యాన్ని సాధిస్తుంది. యాదృచ్చింగా ఇప్పుడు నేను చేస్తున్న అఖండ సినిమాలో నేను అఘోరా పాత్ర‌ను చేశాను. ఆ శివుడి ఆశీస్సులు ఈ టీమ్‌కు ఎప్పుడూ ఉండాల‌ని కోరుకుంటూ, యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.

ఈ జ‌నరేష‌న్‌లో క్లాసిక‌ల్ డాన్సర్‌గా సంధ్యారాజు ఇప్ప‌టికే త‌నేంటో రుజువు చేసుకున్నారు. ఇప్పుడు విడుద‌లైన నాట్యంలోని న‌మఃశివాయ సాంగ్‌లో మ‌రోసారి అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను చేశారు. ఈ పాట ప్ర‌పంచంలోని తెలుగు ప్రేక్ష‌కుల‌ను హృద‌యాల్లో ఓ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంటుంది. రేవంత్ కోరుకొండ వంటి యంగ్ టాలెండ్ డైరెక్ట‌ర్, కేవ‌లం ద‌ర్శ‌క‌త్వమే కాకుండా సినిమాటోగ్ర‌ఫీ, ఎడిటింగ్ విభాగాల్లోనూ త‌న ప్ర‌తిభ‌ను చాటారు. క‌మల్ కామ‌రాజు నాట్యం సినిమా కోసం ఏడాది పాటు క‌ష్ట‌ప‌డి త‌న శ‌రీరాకృతిని మార్చుకున్నారు. ఈ చిత్రంలో ఆయ‌న ఓ క్లాసిక‌ల్ డాన్స‌ర్‌గా కనిపిస్తారు. సంధ్యారాజుగారి శిక్ష‌ణ‌లో ఏడాది పాటు కూచిపూడిలో శిక్ష‌ణ కూడా తీసుకున్నారు.

ఈ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌కు ఆరు రోజుల స‌మ‌యం ప‌ట్టింది. వంద‌లాది జూనియ‌ర్ ఆర్టిస్ట్స్‌ ఇందులో పాల్గొన‌గా లేపాక్షి ఆల‌యంలో ఈ పాట‌ను చిత్రీక‌రించారు. ఈ పాట‌ను 40 డిగ్రీల ఎండ‌లో చిత్రీక‌రించారు. ఎంతో క‌ష్ట‌మైనా, కాళ్లు మండుతున్నా డాన్స‌ర్స్ ఈ పాట‌ను పూర్తి చేశారు. జ‌గ‌ద్గురు ఆది శంక‌రాచార్య వారి అర్థ‌నారీశ్వ‌ర స్తోత్రాన్ని పాట‌గా మ‌లిచారు. శ్రవణ్ భ‌ర‌ద్వాజ్ ఈ పాట‌ను క్లాసిక్‌, ఫ్లోక్ స్లైల్లో ఆధ్యాత్మికంగా మ‌లిచారు. కాలా భైర‌వ‌, ల‌లిత కావ్య ఈ పాట‌ను పాడారు. ఓ డెబ్యూ నిర్మాణ సంస్థ‌, డెబ్యూ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించిన దైవ‌త్వం నిండిన ఈ పాట‌ను వీక్షించ‌డానికి అద్భుతంగా ఉంది.

ల‌హ‌రి యూట్యూబ్ ఛానెల్‌లో ఈ పాట‌ను విడుద‌ల చేశారు. మ్యూజిక్ ల‌వ‌ర్స్ క‌చ్చితంగా వినాల్సిన పాట‌. అద్బుత‌మైన విజువ‌ల్స్‌తో అంద‌మైన ఆర్టిటెక్చ‌ర్ ఉన్న హంపి, లేపాక్షి, బెంగుళూరు, హైద‌రాబాద్‌ల‌లో ఆల‌యాల్లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

న‌టీన‌టులు: సంధ్యారాజు, క‌మ‌ల్ కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్‌, ఆదిత్య మీన‌న్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భానుప్రియ‌, బేబీ దీవ‌న త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
స్క్రిప్ట్‌, కెమెరా, ఎడిటింగ్‌, ద‌ర్శ‌కత్వం: రేవంత్ కోరుకొండ‌
నిర్మాణ సంస్థ‌: నిశ్రింక‌ళ ఫిల్మ్‌
సంగీతం: శ్రవణ్ భ‌రద్వాజ్‌
పాటలు: క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌
ఆర్ట్‌: మ‌హేశ్ ఉప్పుటూరి
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సంధ్యా రాజు
వి.ఎఫ్‌.ఎక్స్‌: థండ‌ర్ స్టూడియోస్‌
క‌ల‌రిస్ట్‌: ఎం.రాజురెడ్డి
ఎస్ఎఫ్ఎక్స్‌: సింక్ సినిమాస్‌
సౌండ్ మిక్సింగ్‌: కృష్ణంరాజు
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: వాల్మీకి శ్రీనివాస్‌
డిజిట‌ల్ ప్ర‌మోష‌న్స్‌: శ్రేయాస్ మీడియా
పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌

- Advertisement -