వృద్ధ్యాప్య పెన్షన్లపై కొత్త జీవో జారీ

178
aasara
- Advertisement -

రాష్ట్రంలో వృద్ధాప్య పింఛను వయస్సును ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గిస్తూ తెలంగాణ సర్కార్‌ జీవో జారీ చేసింది. ఇప్పటి వరకు వృద్ధాప్య పింఛను వయోపరిమితి 65 సంవత్సరాలు ఉండగా.. దానిని ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో వృద్ధాప్య పింఛను ఏజ్ లిమిట్ ను తగ్గించాలన్న నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

వృద్ధాప్య పించన్ ఏజ్ లిమిట్ తగ్గించడంతో 6లక్షల 62వేల మందికి కొత్తగా పింఛన్లు అందుకోనున్నారు. దీంతో మొత్తం పింఛన్ల సంఖ్య 58 లక్షలకు చేరుకుంది. సీఎం కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.

కుటుంబంలో ఒక్కరికే పింఛన్‌ పద్ధతిని కొనసాగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భర్త చనిపోతే భార్యకు.. భార్య చనిపోతే భర్తకు వెంటనే పింఛన్‌ను బదిలీ చేయాలన్నారు.

- Advertisement -