చిరంజీవి – సురేఖ మ్యారేజ్ డే ఫోటో

521
chiru 37th Wedding Anniversary
- Advertisement -

ఖైదీ నెంబర్ 150 హిట్ తర్వాత నెక్స్ట్ సినిమాలపై దృష్టి సారించాడు మెగాస్టార్ చిరంజీవి. 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కథతో సినిమా తెరకెక్కనుండగా ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఇక నిన్న ఫిబ్రవరి 20 మెగాస్టార్ 37వ మ్యారేజ్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తయి. సినీ ప్రముఖులతో పాటు మెగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

 chiru 37th Wedding Anniversary

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల సామాజిక కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొంది. నెల్లూరులోని గీతామయి వృద్ధాశ్రమంలో అన్నదానం, వస్త్రదానం చేసిన చిరంజీవి యువత మెగాస్టార్ పై తమ అభిమానాన్ని చాటుకుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చిరంజీవి పెళ్లి శుభలేఖ, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుండటంతో ఆయన అభిమానులు ఈ ఫొటోలను చూసి తెగ మురిసిపోతున్నారు.

పెళ్లి దుస్తుల్లో ఉన్న చిరంజీవి, సురేఖలు నమస్కరిస్తున్న దృశ్యం ఓ ఫొటోలో ఉంది. మరో ఫొటోలో పెళ్లి శుభలేఖ .. దాని పక్కనే చిరంజీవి, సురేఖ దంపతుల ఫొటో ఉన్నాయి. కాగా,1980 ఫిబ్రవరి 20న చిరంజీవి వివాహం ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో మద్రాసులో ఉదయం 10.50 గంటలకు జరిగింది. అదే రోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య రిసెప్షన్ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది.

- Advertisement -