రెజీనా – నివేదాతో సుధీర్ వర్మ..షూటింగ్ అప్‌డేట్!

243
niveda
- Advertisement -

స్వామిరారా చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సుధీర్ వర్మ. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టగా తర్వాత చైతూతో దోచెయ్,నిఖిల్‌తో కేశవ అనే చిత్రాలను చేసి పర్వాలేదనిపించాడు. తర్వాత రెండు సినిమాలు తీసిన అవి బాక్సాఫీస్ ముందు పెద్దగా ఆకట్టుకోలేదు.

తాజాగా సూపర్ హిట్ కొరియన్ చిత్రం ‘మిడ్ నైట్ రన్నర్స్’తో రాబోతున్నారు సుధీర్ వర్మ. ఈ సినిమాలో రెజీనా – నివేదా థామస్ కీ రోల్ పోషిస్తున్నారు. తాజాగా సినిమా షూటింగ్ సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. షూటింగ్ ప్రారంభమైందని ఇందుకు సంబంధించిన ఫోటోను రిలీజ్ చేశారు.

ఈ సినిమాకి ‘శాకినీ-ఢాకినీ’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట సుధీర్ వర్మ. అంతేగాదు హీరోయిన్స్ ఇద్దరూ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకున్నారట.

- Advertisement -