వర్మా…ఇంత జరిగినా మాట్లాడరేం..?

198
Ram Gopal Varma no reaction toBhavana kidnapped issue
- Advertisement -

రామ్‌గోపాల్‌ వర్మ. సినీ ఇండస్ట్రీకి ఈ పేరు తెలియంది కాదు. ఈ పేరు కలిగిన మనిషి కూడా అందరికీ సుపరిచితమే. సినీ ఇండస్ట్రీలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు వర్మ. ఆయన గురించి ఇంకా చెప్పాలంటే..తనకు మాత్రమే నచ్చిన, తను మాత్రమే మెచ్చిన పనులను చేస్తుంటాడు. అందుకే ఆయన సినీ ఇండస్ట్రీలో ఫేమస్‌. ఎక్కడ ఏం జరిగినా.. వెనువెంటనే స్పందించే కొద్దిమంది సినీ ప్రముఖుల్లో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒకరు. సినీ ప్రముఖుల్లో అందరి కన్నా వెంటనే స్పందించేది వర్మానే అన్నా తప్పులేదేమో.!

ఇక.. నేర సంబంధమైన అంశాల విషయంలో తనకున్న విస్తృతమైన నెట్ వర్క్ ను ఉపయోగించుకొని సమాచార సేకరణ స్టార్ట్ చేస్తారని అంతా చెప్పుకుంటారు. అంతేకాకుండా దీనికి తగ్గట్టే ట్విట్టర్ లో ఆయన వ్యాఖ్యలు కూడా ఉంటాయి. అయితే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు ఓ విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు.  ఆ విషయమే  హీరోయిన్ భావన కిడ్నాప్‌.. లైంగిక వేధింపులకు గురికావడం. ఈ విషయం మీద వర్మ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే కేరళలో చోటుచేసుకున్న హీరోయిన్ భావన కిడ్నాప్.. లైంగిక వేధింపుల ఇష్యూ మీద ఇంతవరకూ వర్మ స్పందించకపోవటం గమనార్హం.
 Ram Gopal Varma no reaction toBhavana kidnapped issue
మొన్నటికి మొన్న జయలలిత, శశికళ ఎపిసోడ్ నే తీసుకుంటే..తమిళంలో జరిగిన రాజకీయ పరిణామాలపై వెంటనే స్పందించిన వర్మ, సినీ ఇండస్ట్రీలోని ఓ హీరోయిన్‌ పై జరిగిన దాడి  అంశం మీద స్పందించలేదు. అయితే నటికి ఎదురైన దారుణం పై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఖండించటం.. ఆమెకు అండగా ఉంటామని చెప్పటం తెలిసిందే.

మరి ఇంత జరుగుతున్నా.. ఈ విషయం రాంగోపాల్ వర్మ దాకా వెళ్ళలేదా? లేక ఈ విషయం నాకెందుకులే అని ఆయన స్టైల్‌ లో సైలెంట్‌గా ఉన్నాడా? అనేది అర్థం కాని విషయం. ఏదేమైనా..వీలైత  ఆయనకున్న విస్తృతమైన నెట్ వర్క్ ను ఉపయోగించి బిహైండ్ స్క్రీన్ సమాచారాన్ని పోలీసులకు అందిస్తే.. నిందితులకు కఠినశిక్షలు పడే అవకాశం ఉంటుందేమోనన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.

- Advertisement -