బన్ని ఫ్యాన్స్‌ కి ఇక.. సూపర్‌ మచ్చి..!!

726
Allu Arjun entry as a police officer in DJ?
- Advertisement -

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ఇప్పుడు మాంచి రేస్‌ లో ఉన్నాడు. వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టేస్తున్నాడు బన్ని. ‘సరైనోడు’ సినిమాతో అటు క్లాస్‌ ఆడియెన్స్‌ తో పాటు ఇటు మాస్‌ ఆడియెన్స్‌ ని కూడా మరింత ఆకట్టుకున్నాడు ఈ స్టైలిష్‌స్టార్‌. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు మాత్రం బన్ని మాస్‌ క్యారెక్టర్‌ కే ఎక్కువగా కనెక్ట్‌ అయ్యారనే చెప్పాలి. అందుకే రాబోయే బన్ని సినిమాల్లో కాస్త మాస్‌ ఉండందే మజా ఏముంటుంది అనుకుంటున్నారు ప్రేక్షకులు.

అయితే  బన్ని ‘సరైనోడు’ తర్వాత ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో త్వరలో మరో హిట్‌ కొట్టడానికి రెడీ అయిపోతున్నాడన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు లుక్ ఇటీవలే బయటికొచ్చింది. ఈ ఫస్ట్‌ లుక్ కి సోషల్‌ మీడియాలో తెగ రెస్పాన్స్‌ వస్తోంది. అయితే ఈ సినిమాలో బన్ని కేటరింగ్ సర్వీస్ చేసే బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో బన్ని పాత్ర అంతే అయితే  కథలో మజా ఏవుంటుంది? ఈ కథలో ఏదో తెలియని ట్విస్ట్‌ ఉండే ఉంటుంది అనుకుంటున్నారు బన్ని ఫ్యాన్స్‌.
Allu Arjun entry as a police officer in DJ?
బన్ని ఫ్యాన్స్‌ అనుకున్నట్టుగానే బన్ని కనిపించిన బ్రాహ్మణ పాత్ర వెనుక పెద్ద కథే వుందట. ఇందులో బన్ని ఒక మిషన్ కి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం కోసం బ్రాహ్మణ పాత్రలో ఉంటూ పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తూ ఉంటాడట. చివరికి బ్రాహ్మణ యువకుడి వేషంలో వున్న పోలీస్ ఆఫీసర్ గా బన్ని బయటకొస్తాడని టాక్‌.  మరి ఇలాంటి అనూహ్యమైన మలుపులతో కొనసాగే ఈ కథ బన్నికి మరో హిట్ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి బన్నిలో ఉన్న మాస్‌ యాంగిల్‌ ని మాత్రం బన్ని ఫ్యాన్స్‌ మిస్సవరన్నమాట..! ఫ్యాన్స్‌ అనుకున్నట్టే ఈ సినిమా కథనం బాగుండి, మాస్‌ ఎలిమెంట్స్‌తో  దుమ్మురేపితే ఇక ఫ్యాన్స్‌ కి సూపర్‌ మచ్చే..!!

- Advertisement -