చేనేత సత్యాగ్రహ దీక్షలో పవన్ మాట్లాడుతూ.. డీమానిటైజేషన్ తో స్వర్ణకారులు చాలా నష్టపోయారని ఆయన అన్నారు. డీమానిటైజేషన్ కారణంగా డబ్బున్నవారెవరూ ఇబ్బందులు పడలేదని, కేవలం మధ్యతరగతి, పేదలు మాత్రమే చాలా ఇబ్బందులపాలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాను కేవలం చేనేత కార్మికులకు మాత్రమే కాకుండా చేనేత కార్మికులతో పాటు స్వర్ణకారులకు కూడా అండగా ఉంటానని ఆయన తెలిపారు. అలాగే ప్రత్యేకహోదా పోరాటంలో అరెస్ట్ అయిన ప్రతి జనసేన కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రత్యేకహోదా ఎందుకు ఇస్తామన్నారు? తరువాత ఎందుకు ఇవ్వమన్నారు? అన్న నిజాలు ఆయా పార్టీలు వెల్లడించే వరకు ప్రత్యేకహోదా కోసం పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
చేనేత కార్మికులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అలాగే ఈ రంగాలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ఇంకా చాలా డిమాండ్స్ తన ముందుకు వచ్చాయని అన్నారు. త్వరలోనే వాటిని పరిశీలించి భవిష్యత్ పోరాటం దేనిపై చేయాలో నిర్ణయిస్తానని ఆయన తెలిపారు.