నాగార్జున తనయుడు అఖిల్ ‘అఖిల్’ సినిమాతొ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. భారీ అంచనాలతో విడుదలయిన ‘అఖిల్’ పై నాగార్జున కూడా ఆ సినిమా మంచి విజయం సాధించాలని ఆశపడ్డాడు. కానీ అందుకు భిన్నంగా ఆ సినిమా సక్సెస్ ని అందుకోలేకపోయింది. దాంతో అఖిల్ తర్వాతి సినిమా విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని నాగ్ భావించాడు. అందుకే అఖిల్ నటించే తదుపరి సినిమా విషయంలో నాగార్జున చాలా కేర్ తీసుకున్నారు.

అఖిల్ నెక్ట్స్ సినిమా విషయంలో లేట్ అయినప్పటికీ మంచి దర్శకుడు, మంచి కథతో సెట్స్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే అఖిల్ ఇప్పుడు తన రెండో సినిమాకి రెడీ అయ్యే అవకాశం రానే వచ్చింది. మంచి కథ కోసం వెతుకుతున్న నాగార్జున ఈ క్రమంలో ‘మనం’ ఫేం విక్రంకుమార్ చెప్పిన సబ్జెక్టుకు ఓకే చెప్పారు. కాగా, ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని కూడా చెప్పి ఫ్యాన్స్ కి తీపి కబురు అందించారు.
వచ్చే నెలలో దీనిని ప్రారంభిస్తామని నాగార్జున ఈ రోజు మీడియాకు తెలిపారు. ఇందులో అఖిల్ సరసన మేఘా ఆకాశ్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతో తనయుడుకి మంచి హిట్టివ్వాలని నాగ్ పట్టుదలగా వున్నారు. అందుకే ఎంత లేట్ అయినా మంచి కథ కోసం వెతికే పనిలో పడ్డ నాగ్ కి ఈ సారైనా అఖిల్ హిట్ ఇస్తాడో లేదో చూడాలి.

