భారీ ధరకు ‘గని’ డిజిటల్ రైట్స్..!

155
ghani
- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గని. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రం వరుణ్ కెరీర్‌లో మొట్టమొదటి స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. సినిమా షూటింగ్ దశలో ఉండగానే డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి.

తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’… ‘గని’ డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ని 24 కోట్లకు కొనుగోలు చేసింది. వరుణ్ తేజ్ పాన్-ఇండియా చిత్రానికి ఇది భారీ భారీ మొత్తమనే చెప్పాలి. అల్లు బాబీ, సిద్ధూ ముద్దా నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటిస్తోంది. సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమా కోసం బాక్సింగ్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు వరుణ్ తేజ్. అంతేకాదు తన పాత్రకు తగినట్లుగా తన శరీరాన్ని మార్చుకున్నాడు.

- Advertisement -