సోమవారం బీఆర్కే భవన్లో సినిమా నిర్మాతల మండలి సభ్యులతో తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులతో పాటు సినీ నిర్మాతలు దిల్ రాజు, దామోదర ప్రసాద్, దగ్గుబాటి సురేష్ బాబు లు పాల్గొన్నారు. కొవిడ్ ఉధృతి కారణంగా గత కొంత కాలం నుంచి సినిమా థియేటర్లు మూతబడిన విషయం విదితమే. ఈ భేటీలో థియేటర్లు రీ ఓపెన్, సినిమాల విడుదల, షూటింగ్‌లతో పాటు సంబంధిత అంశాలపై చర్చించారు.
అనుమతించినా ఇంకా థియేటర్స్ ఎందుకు ప్రారంభించలేదని, సినిమాలు ఎందుకు విడుదల చేయటం లేదని ఈ సమావేశంలో సీఎస్ ప్రశ్నించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్స్ ప్రారంభిస్తే తప్ప విడుదల సాధ్యంకాదని నిర్మాతలు స్పష్టం చేశారు. ఇక థియేటర్లలో పెయిడ్ పార్కింగ్ అనుమతించాలని,పెయిడ్ పార్కింగ్ వల్లే 40 శాతం ఆదాయం ఉంటుందని సీఎస్‌కు నిర్మాతలు తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి చెప్తాను అని సీఎస్ సోమేష్ కుమార్ నిర్మాతలకు చెప్పారు.