సోమవారం తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశారు. అయితే.. ఇది రాజకీయ భేటీ కాదు. ఇవాళ పువ్వాడ అజయ్ కుమార్ కొడుకు నయన్ బర్త్ డే. ఈ సందర్భంగా.. యంగ్ టైగర్‌ను కలిశారు. నయన్ జూ. ఎన్టీఆర్ అభిమాని కావడంతో.. పుట్టిన రోజు వేళ తారక్‌ను కలవాలని కోరాడట. దీంతో జూనియర్ అపాయింట్ మెంట్ తీసుకోవడం.. వెళ్లి కలిసిరావడం జరిగిపోయింది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ కూడా అక్కడే ఉన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జూనియర్ ఎన్టీఆర్‌ను శాలువాతో సత్కరించారు. నయన్ పుట్టిన రోజు సందర్భంగా.. జూనియర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ విషయాన్ఇన మంత్రి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. నా తనయుడు డాక్టర్ పువ్వాడ నయన్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడమైంది’ అంటూ మంత్రి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తారక్ తో తీసుకున్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. ఇక తారక్ సినిమాల గురించి చూస్తే.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో తన 30వ చిత్రం చేయబోతున్నాడు.