అండర్ గ్రౌండ్ పార్కింగ్‌కు చెక్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఎకరా కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించబోయే మల్టీప్లెక్స్ బిల్డింగ్‌లో అండర్ గ్రౌండ్ పార్కింగ్‌కు చెక్ పెట్టింది ప్రభుత్వం. మొదటి 5 అంతస్తుల వరకు మాత్రమే పార్కింగ్ వాడుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.
వర్షాల సమయంలో సెల్లార్లలో భారీగా నీరు చేరి ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కొత్త విధానం అమల్లోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలిలాంటి అనేక ప్రాంతాల్లో భూగర్భ పార్కింగ్‌లోకి నీరు చేరి ఇబ్బంది
తలెత్తింది.ఈ నేపథ్యంలోనే కొత్త రూల్స్ తీసుకురాగా ఈ రూల్స్ బ్రేక్ చేస్తే బిల్డింగ్ ఓనర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 2012లో రూపొందించిన బిల్డింగ్ రూల్స్‌ను సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. భవనం ఎత్తు 55 మీటర్ల లోపు ఉంటే 7 మీటర్ల సెట్‌బ్యాక్ ఉండాలని సూచించింది.