- Advertisement -
వకీల్ సాబ్తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రీ ఎంట్రీతో అదరగొట్టిన పవన్ …ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. తాజాగా బాహుబలి రైటర్,రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథ నచ్చడంతో ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ కోసం ఓ కథ రాశారని.. అది చాలా పవర్ ఫుల్ సబ్జెక్ట్ అని ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్, రాజమౌళి కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుండగా ఒకవేళ రాజమౌళి తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేస్తే ఆయనే దర్శకత్వం వహించే అవకాశం ఉంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.
- Advertisement -