తన అందం,నటనతో టాలీవుడ్,కోలీవుడ్‌లలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్నా. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అగ్రహీరోలతో నటిస్తూ మెప్పిస్తున్న రష్మికా…ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మికా.. పెట్టిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. డైలీ దినచర్యలో భాగంగా డైరా రాస్తానని..అలా తన డైరీ గురించి చెబుతూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఓ ఓ నా డైరీని మరిచిపోయాను.. నా ఆరా నన్ను డిస్టర్బ్ చేయడంతో నిద్ర లేచాను. షూటింగ్ లేదు కాబట్టి కాసేపు టీవీ చూశాను.. ఊరికే ఉదయాన్నే లేచాను. ఆరాకు ఇవ్వాల్సిన ఆహారం, మందులు ఇచ్చాను. నా టీం వచ్చింది.. వారితో కాసేపు ముచ్చట్లు పెట్టాను. ఇక ఫోన్ ద్వారానే రెండు ఇంటర్వ్యూలు ఇచ్చానని తెలిపింది. ఆ తరువాత మీటింగ్ కోసం రెడీ అయ్యాను. మీటింగ్ చాలా బాగా జరిగింది. అక్కడి వారంత మంచివారు. ఇక ఓ యాడ్ ఫిల్మ్‌కు డబ్బింగ్ చెప్పాను. రాత్రి ఎనిమిది గంటలకు రిటర్న్ వచ్చేశాను. అన్నం తిన్నాను.. మళ్లీ ఆరాకు ఫుడ్, మెడిసిన్స్ ఇచ్చాను. ఆ తరువాత ఇద్దరం పడుకున్నాం… అలా రోజు మొత్తం గడిచిపోయిందని తన డైలీ యాక్టివిటీని లీక్ చేసింది రష్మిక.