28 రోజులకే సెకండ్ డోస్..

115
dmho
- Advertisement -

విదేశాలకు వెళ్లే వారికి శుభవార్త. కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్‌ను 84 రోజుల నుంచి 28 రోజులకు తగ్గిస్తూ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధన విదేశాలకు వెళ్లే వాళ్లకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించిన ఆయన వర్క్ పర్మిట్ వీసాపై విదేశాలకు వెళ్తున్న వాళ్లు కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.

హైదరాబాద్‌ సహా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ఒక్కో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌‌(యూపీహెచ్‌సీ)లో వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని..వీసా చూపించిటీకా వేయించుకోవాలన్నారు. ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేదని వెల్లడించారు.

- Advertisement -