సీఎం కేసీఆర్ ఇలాంటి ఆలోచన చేయడం సంతోషం- చాడ

199
Chada Venkat Reddy
- Advertisement -

దళిత సాధికారత కోసం సీఎం కేసీఆర్‌ స్వయంగా ముందుకు రావడం, అటువంటి ఆలోచన చేయడం సంతోషంగా వుందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి. తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. సీఎం దళిత సాధికారత విధివిధానాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని ఎస్సీ ప్రజాప్రతినిధులతో పాటు బీజేపీ, మజ్లిస్, సీపీఎం, సీపీఐ పార్టీల నేతలు హాజ‌ర‌య్యారు.

ఈ సమావేశంలో చాడా వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.. సీఎం కెసిఆర్, 2003 లోనే దళిత సాధికారత కోసం సమావేశం ఏర్పాటు చేసి..అనేక అంశాలను చర్చించడం నాకు గుర్తున్నది. ప్రభుత్వం అమలు పరుస్తున్న కళ్యాణ లక్ష్మి వంటి పలు అభివృధ్ధి సంక్షేమ పథకాలు.. దళితులకు భరోసానిస్తున్నాయని చాడ అన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించడంతో పాటు, దళితుల మీద దాడులు జరిగితే ఊరుకోబోము..అనే రీతిలో, కార్యాచరణ చేపట్టి, ప్రభుత్వం దళితులకు మరింతగా ధైర్యాన్నినింపాలి అని చాడ తెలిపారు.

- Advertisement -