మరియమ్మ లాకప్ డెత్ దురదృష్టకరం- డీజీపీ

112
dgp
- Advertisement -

యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో లాకప్ డెత్ అయిన మరియమ్మ సంఘటన దురదృష్టకరం అన్నారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. మృతురాలు మరియమ్మ కుమారుడిని డీజీపీ పరామర్శించారు. ఆదివారం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్‌ను కలిసి ఘటనపై ఆరా తీశారు. ఓ దొంగతనం కేసులో అడ్డగూడూరు పోలీసులు మరియమ్మ, ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్, ఆమె కూతురును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా డీసీపీ మీడియాతో మాట్లాడుతూ.. సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరియమ్మ కుటుంబ సభ్యులైన కొడుకు, కూతుర్లు, అల్లుళ్లను ఖమ్మం ఆసుపత్రిలో పరామర్శించాం. ప్రభుత్వం ఇప్పటికే ఆ కుటుంబాని తగిన సాయాన్ని ప్రకటించింది అన్నారు.మరియమ్మ సంఘటనలో బాద్యత అందరిదీ అన్నారు.

సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ప్రజలకు దగ్గరవుతున్నాం.. ఇప్పుడు ఇలాంటి సంఘటన జరగడం దురదుష్టకరం అన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి జరగక్కుండా చూస్తం.. నేరాలను నిరోదించే క్రమంలో ప్రజల ఆత్మగౌరవం దెబ్బ తీయకుండ పోలీసులు విచారణ జరపాలి. నేరస్థులకు శిక్ష పడే విధంగా పోలీసులు చట్టప్రకారమే వ్యవహరించాలని డీజీపీ తెలిపారు. మరియమ్మ కుటుంబ క్షేమ సమాచారం, వారికి దక్కాల్సిన సహాయ సహకారాలపై వారితో చర్చించామన్నారు.

కాగా,సీఎం కేసీఆర్ మరియమ్మ కుటుంబానికి రూ.15 లక్షల సాయం, ఆమె కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగాన్నిస్తున్నట్టు ప్రకటించారు. అంతేగాకుండా దళితులపై దాడులు జరగకుండా చూడాలంటూ డీజీపీని ఆదేశించారు. దీంతో ఆయన ఇవాళ ఖమ్మం వెళ్లి ఘటనపై కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు.

- Advertisement -