సీఎం కేసీఆర్ అధ్యక్షతన అఖిల‌ప‌క్ష సమావేశం..

139
- Advertisement -

సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప‌థ‌కానికి సంబంధించి ఆదివారం సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో అఖిల‌ప‌క్ష సమావేశం జరుగుతోంది. ఈ అఖిల‌ప‌క్ష స‌మావేశానికి అన్ని పార్టీల‌కు చెందిన ద‌ళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంఐఎం, కాంగ్రెస్‌, బీజేపీల‌కు చెందిన ఫ్లోర్ లీడ‌ర్లు, సీపీఐ, సీపీఐ(ఎం)ల నుంచి సీనియ‌ర్ ద‌ళిత నేత‌లు, ద‌ళిత వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం పాటుప‌డుతున్న రాష్ట్రంలోని ఇత‌ర సీనియ‌ర్ ద‌ళిత నాయ‌కుల‌కు పాల్గొన్నారు. సీఎం ద‌ళిత సాధికార‌త ప‌థ‌కం విధివిధానాల‌పై స‌మావేశంలో చ‌ర్చిస్తున్నారు.

ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన కొనసాగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీల సంక్షేమం, వయో వృద్దుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మధిర ఎమ్మెల్యే కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు,సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీ ఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, ఎం ఐ ఎం పార్టీ యాకుత్ పుర ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి, పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నేత బొర్లకుంట, నాగర్ కర్నూల్ ఎంపి పోతుగంటి రాములు, వరంగల్ ఎంపి పసునూరి దయాకర్ పాల్గొన్నారు.

అలాగే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీలు డి. రాజేశ్వర్ రావు, గోరటి వెంకన్న, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క్ సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చంటి, జహీరాబాద్ ఎమ్మెల్యే కె. మాణిక్ రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న, అచ్చంపేట్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఆలంపూర్ ఎమ్మెల్యే విఎం అబ్రహం, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్, ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ ఎంపి మంద జగన్నాథం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, తదితరులు హజరైయ్యారు.

అధికారులు.. సీఎస్ సోమేష్ కుమార్, సిఎంవో అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, స్మితా సబర్వాల్, శేషాద్రి, శ్రీధర్ దేశ్ పాండే, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ఎస్సీ అభివృద్ధి శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, బుద్దవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మల్లే పల్లి లక్ష్మయ్య, ఎస్సీ కార్పోరేషన్ వైస్ చైర్మన్ మరియు ఎండి కరుణాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ అడిషనల్ డైరక్టర్ ఉమా దేవి,జి టి వెంకటేశ్వర రావు తదితరులు హజరైయ్యారు.

- Advertisement -