ఆసుప‌త్రిలో చేరిన కాంగ్రెస్ నేత వీహెచ్‌..!

143
V Hanumantha Rao
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చేరారు. కొంత‌ కాలంగా ఆయ‌న‌ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న అనారోగ్యానికి గురైన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది. వీహెచ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు ఆకాంక్షిస్తున్నారు. కాగా, గ‌త ఏడాది వీహెచ్‌కు క‌రోనా సోక‌గా ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని కోలుకున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -