డెల్టా వేరియంటే అత్యంత ప్రమాదకరం- డబ్ల్యూహెచ్‌ఓ

260
WHO
- Advertisement -

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకోని వారే ఎక్కువగా కరోనా డెల్టా వేరియంట్ బారినపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో డెల్టా రకాన్ని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ అధిపతి టెడ్రోస్‌ అధనోమ్ గాబ్రియేస‌స్‌ తెలిపారు. డెల్టా రకంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నట్లు వెల్ల‌డించారు. కరోనా వైరస్‌లో ఎన్నో రకాలు పుట్టినప్పటికీ వాటన్నింటికంటే డెల్టా వేరియంటే అత్యంత వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన అన్ని వేరియంట్ల కంటే ఇదే అత్యంత వేగంగా వ్యాప్తిస్తోందని పేర్కొన్నారు.

కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో చాలా దేశాలు ఇటీవల కరోనా నిబంధనలు సడలిస్తున్నాయి. దీంతో కేసులు మళ్లీ పెరుగుతున్నాయని అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ మరింతగా రూపాంతరం చెందే అవకాశం ఉందని హెచ్చరించారు. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం ద్వారా కొత్త వేరియంట్లు రాకుండా నిరోధించవచ్చన్నారు. ఆల్ఫా వేరియంట్ తర్వాత డెల్టా వేరియంటే అత్యంత ప్రమాదకరమని తెలిపారు.

- Advertisement -