యువ గాయని టాలెంట్‌కు ఫిదా అయ్యారు మంత్రి కేటీఆర్. సురేంద్ర తిప్పరాజు అనే ఓ నెటిజన్.. కేటీఆర్‌కు ఓ ట్వీట్ చేశారు. మెదక్ జిల్లాలోని నారైంగి గ్రామంలో శ్రావణి అనే అమ్మాయి బ్రిలియంట్ సింగర్. ఆ గాయని స్వరం మైమరిపించేలా ఉంది. ఆమె ట్యాలెంట్‌కు మీ సహకారంతో పాటు మీ ఆశీస్సులు అవసరమని కేటీఆర్‌కు తిప్పరాజు ట్వీట్ చేశారు. రేలా రే రేలా రే నీళ్లల్లో నిప్పలే వచ్చింది నిజమల్లే.. పడిలేచి నిలిచే రణములో నా తెలంగాణ అనే పాటను శ్రావణి ఆలపించగా.. ఆ వీడియోను కూడా తిప్పరాజు ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. శ్రావణిలో అద్భుతమైన ట్యాలెంట్ ఉందంటూ కేటీఆర్ ప్రశంసించారు. మ్యూజిక్ డైరెక్టర్లు థమన్, దేవీ శ్రీప్రసాద్కు కేటీఆర్ ట్యాగ్ చేశారు. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా స్పందించారు. తాము భవిష్యత్‌లో నిర్వహించే షోలలో శ్రావణికి తప్పకుండా అవకాశం కల్పిస్తామని దేవీ శ్రీప్రసాద్ ట్వీట్లో పేర్కొన్నారు.