ఆ రికార్డును బద్దలుకొట్టిన లోకలోడు..!

233
Nenu Local to be Nani's career highest collection
- Advertisement -

నాని తాజాగా నటించిన సినిమా ‘నేను లోకల్’. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దూసుకుపోతోంది ఈ సినిమా. అంతే కాకుండా తొలివారంలోనే ఈ సినిమా 20 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అదే ఊపులో కొనసాగుతూ.. రెండవ వారం నుంచి లాభాల దిశగా సాగిపోతోంది. ‘ఘాజీ’ రిలీజైనప్పటికీ నాని సినిమా ప్రత్యేకతను చాటుకుంది. బాక్సాఫీస్ రేసులో దూసుకెళ్తూ.. తొలి రోజు వసూళ్ల దగ్గర్నుంచి నాని కెరీర్ రికార్డులన్నింటినీ తుడిచి పెట్టేస్తూ వస్తోంది ‘నేను లోకల్’.

ఇప్పుడు నానీ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ అయిన ‘భలే భలే మగాడివోయ్’సినిమాను కూడా దాటేసింది. ఇప్పటిదాకా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.31 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. ‘భలే భలే మగాడివోయ్’ రూ.30 కోట్ల లోపే షేర్‌ వసూలు చేసింది. అయితే ఈ వారం ఘాజీ’ పెద్ద ఎత్తున రిలీజైనా సరే.. ‘నేను లోకల్’కు అదనంగా థియేటర్లు కలవడం విశేషం. ‘నేను లోకల్’ రిలీజైన తర్వాతి వారం వచ్చిన ఎస్-3.. ఓం నమో వేంకటేశాయ సినిమాలు విడుదలయ్యాయి.

 Nenu Local to be Nani's career highest collection

వాటితో పోటీపడుతూ వసూళ్ళ జల్లును కురిపిస్తోంది ‘నేను లోకల్‌’. అంతేకాకుండా ఈ సినిమాలకు తోడు ‘ఘాజీ’ పోటీని కూడా తట్టుకుంటూ మూడో వీకెండ్లోనూ స్టడీగా కలెక్షన్లు తెస్తోంది నాని సినిమా. ఈ చిత్రం అమెరికాలో ఇప్పటికే మిలియన్ మార్కును దాటేసింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.35 కోట్ల షేర్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా నానిని మరో మెట్టు ఎక్కించిందనడంలో సందేహం లేదు. మొత్తానికి నాని రికార్డును నానియే లోకలోడిగా బద్దలుకొట్టాడన్నమాట.

- Advertisement -