- Advertisement -
పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. రోజువారి సమీక్షలో భాగంగా ఇవాళ కూడా పెట్రోల్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి చమురు కంపెనీలు.
తాజాగా పెట్రోల్ ధర లీటరుకు 28 పైసలు, డీజిల్‌పై 26 పైసలు పెరుగగా తాజా పెంపుతో ఒడిశాలో వంద మార్క్ దాటింది.
ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.97.50, డీజిల్ రూ.88.23కు చేరుకోగా రాజస్ధాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లో వంద దాటేసింది. వ్యాట్ ధరలలో వ్యత్యాసం, సరూకు రవాణా చార్జీలలో స్ధానిక పన్నుల కారణంగా ఆయా రాష్ట్రాల్లో ధరల వ్యత్యాసం ఉంటుంది.
- Advertisement -