కరోనా సెకండ్ వేవ్ కట్టడిలో కేంద్రం ఘోరంగా విఫలమైందని..థర్డ్ వేవ్నైనా సమర్థవంతంగా ఎదుర్కొవాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ.వర్చువల్‌గా మీడియాతో మాట్లాడిన రాహుల్..కేంద్ర వ్యాక్సినేషన్ విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
తాను రిలీజ్ చేసిన శ్వేతపత్రం ఓ బ్లూ ప్రింట్ అని, థార్డ్ వేవ్‌కు ఎలా ప్రిపేరవ్వాలో చెబుతోందన్నారు. రెండవ వేవ్ సమయంలో జరిగిన లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ అనేది కీలకమైన పిల్లర్ అన్నారు. చాలా దూకుడుగా ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని, వంద శాతం వ్యాక్సినేషన్ జరగాలన్నారు.
ప్రధాని మోదీ కన్నీళ్లు ప్రజల్ని కాపాడలేవని, కేవలం ఆక్సిజన్ మాత్రమే రక్షిస్తుందన్నారు. జనాభా మొత్తం వ్యాక్సిన్ వేయించుకునే వరకు ఈ ప్రక్రియ సాగాలన్నారు. ఫస్ట్, సెకండ్ వేవ్‌లో ప్రభుత్వ మేనేజ్మెంట్ దారుణంగా విఫలమైనట్లు చెప్పారు. వైరస్ మ్యుటేట్ అవుతన్న కారణంగా..మునుముందు మరిన్ని వేవ్‌లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.