- Advertisement -
తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు వెటర్నరీ కళాశాలలు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. సిద్దిపేట, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం సిద్ధిపేట జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కళాశాలల మంజూరు ప్రకటన చేశారు.
- Advertisement -