తెలంగాణలో సంపూర్ణంగా లాక్ డౌన్‌ ఎత్తివేత..

131
kcr
- Advertisement -

తెలంగాణలో లాక్ డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మేరకు లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.

శనివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రి మండలి అత్యవసర సమావేశమైంది. ఈ సమావేశంలో కరోనా పరిస్థితులపై మంత్రి మండలి సమీక్షిస్తుంది. లాక్‌డౌన్‌ వేళల సడలింపుతోపాటు వివిధ అంశాలపై చర్చింస్తున్నది. కరోనా పాజిటివ్‌ కేసులు, రికవరీ, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత అంశాలతోపాటు గోదావరి నుంచి నీటి ఎత్తిపోత, జలవిద్యుదుత్పత్తి, కృష్ణాపై ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తున్న ప్రాజెక్టులు, రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్‌ కుడికాల్వ నిర్మాణం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన, ఇంటర్‌ ఫలితాలు, పాఠశాలలో వసతుల కల్పన అంశాలపైనా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఈరోజుతో లాక్‌డౌన్‌ ముగియనున్న విషయం తెలిసిందే. కరోనా ఉధృతి తగ్గిన దృష్ట్యా లాక్‌డౌన్‌ ఆంక్షలనూ ప్రభుత్వం సడలించింది.

- Advertisement -