డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ నిర్మాణం అద్భుతం- మంత్రి కేటీఆర్‌

130
ktr
- Advertisement -

తెలంగాణలో పేద‌లు ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌నే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అన్ని ర‌కాల వసతులతో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా జంగంప‌ల్లిలో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను అత్యంత అద్భుతంగా నిర్మించారు. ఈ ఇండ్ల నిర్మాణంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. గ్రామీణ తెలంగాణ‌లో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ఎలా సాగుతుందో ఈ చిత్రాలు నిద‌ర్శ‌మ‌ని పేర్కొన్నారు. డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ఎలా సాగుతుందో ఈ చిత్రాల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంద‌న్నారు. ఈ ఇండ్ల నిర్మాణం ఒక్క తెలంగాణ‌కే కాదు.. దేశానికే ఒక ప్ర‌మాణాన్ని నిర్దేశిస్తున్నాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -