ఏపీలో కొత్తగా 6,341 కరోనా కేసులు నమోదు..

89
corona
- Advertisement -

ఏపీలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 6,341 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో అత్యల్పంగా ఇద్దరు చొప్పున చనిపోయారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 8,486 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 67,629 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 12,224 మంది మృతి చెందారు. ఇక ఇంతవరకు 18,39,243 మంది కరోనా బారిన పడగా… 17,59,390 మంది కోలుకున్నారు.

- Advertisement -