- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు ఢిల్లీలోని నార్త్ ఎవిన్యూ లోని తన నివాసంలో మొక్కలు నాటారు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంత్ కబీర్ నగర్ నియోజకవర్గం లోక్ సభ సభ్యులు ప్రవీణ్ నిషాద్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని ప్రతి ఒక్కరం బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.మనం నాటిన ప్రతి మొక్క వృక్షంగా ఎదిగే ఈ విధంగా వాటిని కాపాడాలని కోరారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో ఇంత పెద్ద ఎత్తున చైతన్యం తీసుకువస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు.
- Advertisement -