- Advertisement -
టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కావేటి లక్ష్మీ నారాయణ మరణం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సంతాపం వ్యక్తం చేశారు. కావేటి మరణం పార్టీకి తీరని లోటు అని,టీఆర్ఎస్ సేవా దృక్పథం కలిగిన ఒక నాయకున్ని కోల్పోయిందని అన్నారు. పార్టీ ఇన్సూరెన్స్ విభాగం బాధ్యతగా వందలాది మంది కార్యకర్తల కుటుంబాలకు విశేష సేవలు అందించారని ఈ సందర్భంగా కేటీఆర్ లక్ష్మీనారాయణ సేవలను గుర్తుచేశారు. లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
- Advertisement -