- Advertisement -
నటుడిగా వెండితెరకు పరిచయమై ఆ తర్వాత మెగా ఫోన్ పట్టిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్. అందాల రాక్షసి,అలా ఎలా?,హౌరా బ్రిడ్స్(2018),టైగర్ వంటి సినిమాల్లో నటించిన రాహుల్ తన తొలి సినిమా చి.ల.సౌతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తొలిసినిమాకే జాతీయ అవార్డు అందుకున్నారు. తర్వాత వరుస ఆఫర్లు వెల్లువలా వచ్చాయి.
ఈ క్రమంలో ఎవరు ఊహించని విధంగా నాగార్జునతో మన్మథుడు 2 చేశాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అంతగా ప్రభావం చూపించలేదు. అయితే రీసెంట్ గా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మాత బన్నీ వాస్ కి ఓ లవ్ స్టొరీ చెప్పి మెప్పించాడట ఈ దర్శకుడు. చాలా తక్కువ బడ్జెట్ లో క్లాసిక్ ప్రేమకథని తెరకెక్కించనున్నాడట. త్వరలోనే నటీనటులను వెల్లడించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్ హీరోగా ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ తమిళ్ రీమేక్ లో ఐశ్వర్య రాజేష్ కి జోడీగా నటిస్తున్నాడు.
- Advertisement -