ప్రజలు లాక్ డౌన్‌కు సహకరించాలి- డీజీపీ

141
- Advertisement -

తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ప్రక్రియను డిజిపి మహేందర్ రెడ్డి మంగళవారం పరశీలించారు. కూకట్‌పల్లి జె.ఎన్.టి.యు చౌరాస్తాలో డిజిపి ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో డిజిపి మాట్లాడుతూ.. కరోనా వైరస్ చెయిన్ బ్రేక్ చేయటానికి‌ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ప్రజలందరూ కూడా లాక్ డౌన్‌కు పూర్తిగా సహకరించాలి అన్నారు.

లాక్ డౌన్ త్వరగా ముగించాలి అంటే లాక్ డౌన్ విధించినంత కాలం, లాక్ డౌన్ కఠినంగా అమలు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి పైన ఉన్నది. అన్ని కమీషనరేట్ల పరిధులలో పోలీసు అధికారులు లాక్ డౌన్ విధులలో పాల్గొంటున్నారు. మళ్ళీ మళ్ళీ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అయితే అత్యవసర పనులకు వెళ్ళే వారు సజావుగా వెళ్ళేలా చేయాల్సిన బాధ్యత పోలీసులది అని డిజిపి తెలిపారు.

- Advertisement -