భారత్ కు థాయ్‌లాండ్ నుండి మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు

199
covid
- Advertisement -

భారత్‌కు ఆక్సిజన్ సిలిండర్లు అందించడానికి ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. భారత్‌కు థాయ్‌లాండ్ నుండి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు పంపించింది. యుద్ధ ప్రతిపాదికన 11 క్రయోజనిక్ ట్యాంకుల దిగుమతి చేయనున్నారు. ఒక్కో క్రయోజినిక్ ట్యాంకర్ లో 1.40లక్షల (కోటీ నలభై లక్షల ) లీటర్ల ఆక్సిజన్ ఉంటుంది. దేశంలో తొలిసారిగా అధికసంఖ్యలో దిగుమతి… సామాజిక సేవ బాధ్యత లో‌భాగంగా థాయ్‌లాండ్ నుండి ఆక్సిజన్ టాంకర్లను భారత్ కు దిగుమతి చేస్తున్న MEIL మేఘా ఇంజనీరింగ్ సంస్థ తెలిపింది. తమ వంతు‌బాధ్యతగా ఉచితంగా 11 టాంకర్లను థాయ్‌లాండ్ నుండి దిగుమతి చేసింది మేఘా.

తొలి విడతగా ఆర్మీ విమానంలో 3 ట్యాంకుల రానుండగా తొలిదశలో ఇవ్వాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేకంగా డిఫెన్స్‌ ఎయిర్ క్రాఫ్ట్ లో చేరుకోనున్నాయి ఆక్సిజన్ ట్యాంకర్లు. ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వనుంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ
. ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం అని తెలిపారు.

- Advertisement -