తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడగింపు..

147
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 10 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గడువు శుక్రవారంతో ముగియనుంది. అయితే తాజాగా లాక్‌డౌన్‌ను పొడగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. లాక్‌డౌన్ పొడగింపుపై సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా మంత్రుల అభిప్రాయాన్ని తీసుకున్నారు. మరోవైపు ఈ నెల 20 న జరగాల్సిన తెలంగాణ కేబినెట్‌ భేటీ కూడా రద్దైంది.

- Advertisement -