హీరో రామ్ ఇంట్లో విషాదం..

186
Ram Pothineni
- Advertisement -

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఇంట్లో విషాదం నెలకొంది. రామ్ తాతయ్య ఈరోజు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.. తన తాతయ్య ఒక సామాన్యమైన స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన తీరును గుర్తు చేసుకున్నాడు. రామ్ వాళ్ల తాత.. విజయవాడలో ఒక లారీ డ్రైవర్ గా తన జీవితం ప్రారంభమైందని రామ్ చెప్పాడు. డ్రైవర్ స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలను నేర్పిందని అన్నాడు. కుటుంబానికి అన్ని వసతులు, సౌకర్యాలను అందించేందుకు ఆరోజుల్లో మీరు లారీ టైర్లపైనే నిద్రించేవారని రామ్ గుర్తుచేసుకున్నాడు.

డబ్బులు ఉన్న ప్రతి వ్యక్తి ధనవంతుడు కాలేడని… మంచి మనసుతోనే ధనవంతులు అవుతారనే విషయాన్ని మాకు నేర్పించారని చెప్పాడు. మీ పిల్లలందరూ ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే దానికి మీరే కారణమని తెలిపాడు. మీ మరణం తనను కలచి వేస్తోందని, తన హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తాతయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పాడు.

- Advertisement -