కాదలి ఫస్ట్‌లుక్ విడుదల చేసిన కేటీఆర్‌…..

194
KADALI FIRST LOOK REVEALED BY KTR
- Advertisement -

మంత్రి కేటీఆర్‌ సోషల్‌మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. నెటిజన్ల విజ్ఞపులుపై స్పందించడం, సాయం చేయడం ఇలా విషయం ఏదైన తనకి నచ్చే దానిపై ట్వీట్టర్‌ ద్వారా ప్రశంసలు కురిపిస్తుంటాడు.
 KADALI FIRST LOOK REVEALED BY KTR
అయితే తాజాగా ఓ సినిమా ప్రమోట్‌ చేసే బాధ్యతను కేటీఆర్‌ తీసుకున్నారు. సినిమా పరిశ్రమకు కేటీఆర్‌  చాలా దగ్గరగా  ఉంటారనే విషయం తెలిసిందే. అప్పుడప్పుడు పలు సినిమా ఫంక్షన్స్ కు ముఖ్య అతిధిగా హాజరవుతూ సినిమాపై తనకున్న మక్కువను చాటుకుంటుంటారు. తాజాగా తన బెస్ట్‌ ఫ్రెండ్‌ చిన్ననాటి మిత్రుడు ఆర్‌ చిలుకూరి తొలిసారిగా దర్శకత్వం వహించిన కాదలి సినిమా ఫస్ట్‌లుక్‌ని కేటీఆర్‌ తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు.

అంతేకాకుండా ‘ప్రియమైన స్నేహితుడు చిన్నప్పటి నా క్లాస్ మేట్ అయిన పట్టాభి ఆర్ చిలుకూరి తొలిసారిగా దర్శకత్వం వహించిన మూవీ కాదలి. ఆ చిత్రం ఫస్ట్ లుక్’ అంటూ ట్వీట్ చేసి పలువురు ప్రశంసలు పొందారు మంత్రి కేటీఆర్‌. ఈ సినిమాను మంత్రి ట్వీట్టర్ ద్వారా ప్రమోట్‌చేయడం అందరినీ ఆకట్టుకుంది. కాదలి సినిమాపై కేటీఆర్‌ ట్వీట్ట్‌ చేయడంతో పలువురు నెటిజన్లు కేటీఆర్‌ను సోషల్‌మీడియాలో ప్రశంసలతో  ముంచెత్తారు.
 KADALI FIRST LOOK REVEALED BY KTR
కాదలి చిత్ర టైటిల్ లోని లెటర్స్ తో కొన్ని రోజుల నుండి ఒక్కో పోస్టర్ విడుదల చేస్తూ ఆడియన్స్ లో ఆసక్తి కలిగించింది చిత్ర యూనిట్ .  వేలంటైన్స్ డే స్పెషల్ గా కాదలి చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన టీం క్యాప్షన్స్ తో ఇదొక అందమైన ప్రేమ కథా చిత్రం అనే హింట్ కూడా ఇచ్చారు. ఇద్దరు కుర్రాళ్లు.. ఒక అమ్మాయి మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా ఈ మూవీ తెరకెక్కినట్టు తెలుస్తోండగా.. ‘మీ ప్రేమను ఎంచుకోండి.. మీ ఎంపికను ప్రేమించండి’ అనే క్యాప్షన్ తో ఇంప్రెస్ చేసింది. ‘కొన్ని ఛాయిస్ లను ఎంచుకోవడం చాలా కష్టం’ అంటూ పెట్టిన ట్యాగ్‌లైన్‌ ఆకట్టుకుంటుంది.

- Advertisement -