అగ్రరాజ్యంలో ఇక నో మాస్క్..!

165
covid
- Advertisement -

కరోనా సెకండ్ వేవ్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఓ వైపు జోరుగా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న మరోవైపు భారత్ లాంటి దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుదల అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇక అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతుండగా కరోనా నిబంధనలలో కాస్త సడలింపులు వచ్చాయి.

రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు ఇకపై మాస్కులు లేకుండా బహిరంగంగా తిరగవచ్చని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది.

వ్యాక్సినేషన్ పూర్తయిన వాళ్లు ఒంటరిగా లేదా కుటుంబ సభ్యులతో బయట మాస్క్‌ల్లేకుండా తిరగొచ్చు. వాహనాలపై షికార్లకు వెళ్లొచ్చు. ఒక్క డోస్ వేయించుకున్న వారు కూడా మాస్క్‌లు పెట్టుకోనవసరం లేదు. అయితే కొత్త వ్యక్తుల సమూహంలోకి, పెద్ద గుంపులోకి వెళ్లేటపుడు అందరూ మాస్క్‌లు పెట్టుకోవాలని వెల్లడించింది.

- Advertisement -