సెకండ్ డోస్ టీకా‌ తీసుకున్న మోహన్‌బాబు..

99
Actro Mohan babu
- Advertisement -

క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌స్తుతం మ‌న దేశంలో ప్ర‌ళ‌యం సృష్టిస్తుంది. అయితే క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండాలంటే త‌ప్ప‌ని స‌రి మాస్క్ ధ‌రించ‌డం, టీకా తీసుకోవ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి. ఈ క్ర‌మంలో సామాన్యుల‌ నుండి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు వరకూ రెండు విడత‌లుగా టీకా తీసుకుంటున్నారు.

ఇక తాజాగా ప్రముఖ నటుడు మోహన్‌ బాబు సెకండ్ డోస్ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయన సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాడు. అంతేకాక ప్ర‌తి ఒక్క‌రు వ్యాక్సిన్ తీసుకొని, బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడ‌ల్లా త‌ప్ప‌ని స‌రిగా మాస్క్ ధ‌రించాల‌ని పేర్కొన్నారు. గ‌త నెల మోహ‌న్ బాబు తిరుప‌తిలో ఫ‌స్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఈ విష‌యాన్ని కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

- Advertisement -