సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేశారు.రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్…ఎన్వీ రమణ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి…రమణకు శుభాకాంక్షలు తెలిపుతూ విషెస్ చెప్పారు. మన తెలుగు తేజం సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు….వ్యవసాయ కుటుంబంలో పుట్టి, విద్యార్థి దశ నుండే రైతుల పక్షాన నిలిచి పోరాడిన రైతు బిడ్డ అని కొనియాడారు. సామాన్యుల కష్టం తెలిసిన పాత్రికేయుడు,గత 40 ఏళ్లుగా న్యాయక్షేత్రంలో నిత్యకృషీవలుడు రమణగారు అని కొనియాడారు. ఈ తెలుగు బిడ్డను చూసి ఆయన పుట్టిన ఊరు పులకించిపోతుందన్నారు.
కృష్ణా జిల్లా పొన్నవరంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు రమణ.ఆయన పదవీ కాలం 2022, ఆగస్ట్ 26తో ముగుస్తుంది. 2000, జూన్ 27 నుంచి 2013, సెప్టెంబర్ 1 వరకు ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా పని చేశారు. 2022, ఆగస్టు 26వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.