రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే కేసులు విపరీతంగా పెరిగితే పరిస్థితులకు అనుగుణంగా ప్రభువ్వం పటిష్టమైన నిర్ణయం తీసుకుంటుందని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో లాక్డౌన్ విధించే ఆలోచనేది తెలంగాణ ప్రభుత్వానికి లేదని మంత్రి తెలిపారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సమయంలో కరోనా తీవ్రత ఇంతగా లేదన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలపై వివక్ష చూపుతుందని ఆరోపించారు. కొవిడ్ వ్యాక్సిన్ ధరల విధానం అసంబద్ధంగా ఉందని మంత్రి అన్నారు. కరోనా నుంచి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ, మహారాష్ట్ర తరహా పరిస్థితులు రాష్ట్రంలో లేవని, ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తలసాని తెలిపారు.