‘సూపర్’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది అందాలతార అనుష్క. ‘సూపర్’ విజయంతో ఇక తను వెనక్కి తిరిగి చూడలేనంత ఆఫర్లు ఆమెని వరించాయి. అందుకే పదేళ్ళనుంచి ఈ స్వీటీ బిజీ హీరోయిన్‌గా తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తూ తెలుగు చిత్ర సీమలో ఒక వెలుగు వెలిగింది అనుష్క.
అయితే ఇక ఈ భామని ఇప్పుడు అందరూ అయ్యో పాపం అంటున్నారు. అదే టైంలో ఇక అనుష్కకి సినిమా ఆఫర్లు కరువే అని కూడా సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎంతో కాలం అనుష్క గ్లామర్ హీరోయిన్‌గా కొనసాగకపోవచ్చునని ఆమె తాజా చిత్రాలు చూసిన వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ‘సింగం 3’, ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రాల్లో అనుష్క చాలా లావుగా కనిపించింది.
‘సైజ్ జీరో’ చిత్రం కోసం ఈ అమ్మడు ఒళ్లు పెంచిన పెంచిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పడిదే అనుష్క కొంపముంచేలా ఉందట. ‘సైజ్ జీరో’ తో అనుష్క విజయాన్ని అందుకోలేకపోగా, తన బాడీ షేప్ మొత్తం పాడు చేసుకుంది. గ్లామర్ హీరోయిన్‌గా వెలిగిన అనుష్కని ఇప్పుడు ఒళ్లంతా కప్పి చూపించాల్సిన పరిస్థితి వచ్చింది.
చాలా సందర్భాల్లో ‘సింగం 3’, ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రాల్లో అనుష్క క్లోజ్ అప్‌లతోనే సినిమాటోగ్రాఫర్లు కాలం వెళ్లదీయాల్సి వచ్చింది. ఫుల్ ఫ్రేమ్‌లో, మిడ్ ఫ్రేమ్‌లో కూడా ఆమె చాలా ఆక్వార్డ్‌గా కనిపిస్తూ వుండడంతో అనుష్కని కేవలం తనకున్న స్టార్‌డమ్‌కి అనుగుణంగా తీసుకుంటున్నారే తప్ప తన వల్ల సినిమాలకి న్యాయం జరగడం లేదు అని చెప్పొచ్చు.
అనుష్కకి వస్తోన్న ఫీడ్ బ్యాక్ కూడా బ్యాడ్‌గా వుండడంతో ఇక తనకి అవకాశాలివ్వాలంటే అనుష్క ఒళ్లు తగ్గించుకోక తప్పదు మరి. ఒకవేల అనుష్క అప్పటికి కూడా సన్నబడకపోతే తొందర్లో రాబోతున్న బాహుబలి 2 లో అనుష్కని సన్నగా చూపించేందుకు రాజమౌళి ఏంచేస్తాడో చూడాలి.