ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి…సంరక్షించండి

97
ik reddy
- Advertisement -

పుడమి తల్లిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు మనవంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. భూమాతకు ఎటువంటి హానీ కలుగకుండా కాపాడుకోవాలని ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ఓ ప్రకటనలో కోరారు.

పుడమి తల్లి మన అవసరాలను తీర్చగలదు గానీ అత్యాశలను ఎంతమాత్రం తీర్చలేదని ఆనాడు గాంధీజీ చెప్పిన మాటలు అక్షర సత్యాలని అన్నారు. కాలుష్యం వల్ల ఓజోన్ పొర క్షీణిస్తొందన్నారు. భూమిని కాపాడుకోవటానికి పర్యావరణం, వాతావరణంతోపాటు మానవుని జీవనశైలిలో మార్పు రావాలని సూచించారు.

నేలతల్లి బాగుంటేనే.. మనం బాగుంటాం. భావి తరాలు బాగుంటాయన్నారు. భూమిపై లభించే సహజ వనరులను మనం ఇష్టానుసారంగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హానీ జరుగుతోందని వెల్లడించారు. అడవుల రక్షణ, వన్యప్రాణులు, జీవ వైవిధ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.

- Advertisement -