- Advertisement -
నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఆఖరి నిమిషం వరకు క్యూలో ఉన్న వారికి ఓటే వేసే అవకాశం కల్పించనున్నారు. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. సాగర్ నియోజకవర్గంలో 2లక్షల 20 వేల300 మంది ఓటర్లు ఉండగా లక్ష 9వేల 228 మంది పురుషులు, లక్షా11 వేల72 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు.
మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్), కాంగ్రెస్, బీజేపీలే తొలి మూడు స్థానాల్లో ఉండనున్నాయి. టీఆర్ఎస్ ప్రధానంగా నోముల నర్సింహయ్య తనయుడిని బరిలోకి దింపడంతో అటు సానుభూతి, మరోవైపు చేసిన అభివృద్ధి.. గెలుపు బాటలో నడిపిస్తాయనే ఆత్మవిశ్వాసంతో ఉంది.
- Advertisement -