హైదరాబాద్‌కు గొప్ప చరిత్ర ఉంది- మంత్రి కొప్పుల

242
minister koppula
- Advertisement -

హైదరాబాద్ నగర సమగ్ర చరిత్రపై ఎజాజ్ ఉర్దూ అకాడమీ వారు ప్రచురించిన “సౌకత్-ఇ-ఉస్మానియా” పుస్తకాన్ని ఈరోజు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని కులాలు, మతాలకు చెందిన వాళ్లంతా సోదరభావం, సామరస్యంతో జీవిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ మైనార్టీల భద్రత, సంక్షేమానికి అంకితభావంతో ముందుకు సాగుతున్నారని మంత్రి అన్నారు.

ఉర్దూను ప్రభుత్వం రెండో అధికార భాషగా గుర్తించి దాన్ని ఔన్నత్యాన్ని కాపాడుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం 204 గురుకులాల ద్వారా మైనారిటీలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరానికి గొప్ప చరిత్ర ఉంది. 6,7వ నిజాం నవాబులు హైదరాబాద్ ను గొప్పగా అభివృద్ధి చేశారు.

మత సామరస్యాన్ని కాపాడారని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ మరింత వృద్ధి చెందింది ప్రగతిపథాన పరుగులు పెడుతున్నదని మంత్రి పేర్కొన్నారు. 250 ఫొటోలు, 472 పేజీలతో ఆకర్షణీయంగా అర్థవంతంగా తీసుకువచ్చిన ఈ పుస్తకం విద్యార్థులు, పరిశోధకులు, చరిత్రకారులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు.ఎంతగానో కష్టించి ఈ పుస్తకాన్ని తెచ్చిన ఎజాజ్, అందుకు సహాయపడిన ఉర్దూ అకాడమీ చైర్మన్ రహీముద్దీన్ అన్సారీలకు మంత్రి కొప్పుల అభినందనలు తెలియజేశారు.

- Advertisement -