‘టీకా’ తోనే కోవిడ్‌ను జయించవచ్చు: వకుళాభరణం

250
vakulabaranam
- Advertisement -

అనవసరమయిన అపోహలతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని, కరోనా బారి నుండి రక్షించుకోవడానికి సకాలంలో టీకా తీసుకోవడం మాత్రమే సురక్షితం అని రాష్ట్ర బిసి కమిషన్ పూర్వ సభ్యులు,తెరాస పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. అందుబాటులో ఉన్న సౌకర్యాలతో ఎక్కడ వీలైతే అక్కడ పరీక్షలు నిర్వహించుకోవాలని, టీకా మందు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సోమవారం నాడు ఉదయం డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు నిమ్స్ హాస్పిటల్ లో కోవిషీల్డ్ టీకా ‘రెండో డోస్’ ను వేసుకున్నారు. కోవాక్సిన్,కోవిషీల్డ్ టీకా ఏదైనా ఒకటే అని, అనవసరంగా వస్తున్న పుకార్లను, అనుమానాలను నమ్మవద్దని తెలిపారు.తాను రెండు డోస్ లు తీసుకోవడం జరిగిందని, తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కాలేదన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, ఇతర సిబ్బంది సంయనంతో చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

ప్రజలందరూ తమను తాము రక్షించుకోవడానికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మాస్క్ మరియు సానిటైజర్ వాడాలని వకుళాభరణం తెలిపారు.

- Advertisement -