నూతన ఆవిష్కర్తలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తక్కువ ఖర్చుతో సిమెంట్ పైపుల్లో ఇండ్లను నిర్మిస్తున్న యువతి పేరాల మానస రెడ్డిని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. భవిష్యత్‌లో రాష్ట్రానికి మరింత గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.
కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామానికి చెందిన పేరాల మానస రెడ్డి తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో ప్రాథమిక విద్యాభాసం పూర్తి చేసింది.
సివిల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చదివింది. వివిధ దేశాల్లో అక్కడి వాతావరణానికి అనుగుణంగా తక్కువ ఖర్చుతో ఇండ్లను నిర్మిస్తున్న విధానాలను అధ్యయనం చేసింది.
ఆ అనుభవంతో మన ప్రాంతంలోనూ తక్కువ ఖర్చుతో ఇంటి డైజన్లను రూపొందించింది. రెండు వేల మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కాంక్రీట్ పైపు (తూము)లో 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓపాడ్స్ లేదా మైక్రో ఇళ్లుగా పిలిచే ఇల్లును నిర్మించి శభాష్ అనిపించింది.

