సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి..

190
SRH
- Advertisement -

ఐపీఎల్ 14 2021 సీజన్‌లో భాగంగా‌ చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. హైదరాబాద్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతా నిర్ధేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్స్ విఫలమయ్యారు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ జట్టులో ఓపెనర్ నిశిత్ రానా 80 పరుగులు, రాహుల్ త్రిపాఠి 53 పరుగులతో రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఆ జట్టు 187 పరుగులు సాధించింది. సన్ రైజర్స్ బౌలర్ రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసినా, అతనికి మిగతా బౌలర్ల నుంచి పెద్దగా సహకారం అందలేదు.

ఆపై 188 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్, జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ 3 పరుగులకు, వృద్ధిమాన్ సాహా 7 పరుగులకు అవుట్ కావడంతో సన్ రైజర్స్ కష్టాల్లో పడింది. ఆపై జానీ బెయిర్ స్టో హాఫ్ సెంచరీ సాధించాడు. మనీష్ పాండే 61 (నాటౌట్) పరుగులు చేసి రాణించాడు. అయితే పాండే, బెయిర్ స్టో జోడీ 92 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసినా, ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో క్యాచ్ పట్టిన రానా, వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. చివర్లో యువ ఆటగాడు అబ్దుల్ సమద్ చెలరేగినా, 188 పరుగులను మాత్రం ఆ జట్టు అందుకోలేకపోయింది. దీంతో సన్ రైజర్స్ జట్టు ఈ సీజన్ లో తమ తొలి ఓటమిని చవిచూసింది.

- Advertisement -