సీఎం కేసీఆర్ సిద్దిపేట టూర్‌ షెడ్యూల్…

135
cm
- Advertisement -

సీఎం కేసీఆర్ మంగళవారం సిద్దిపేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి హరీశ్‌ రావు. ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు సీఎం గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారని వెల్లడించారు. ఉదయం 10.30 గంటల కు వర్గల్ మండలం హౌసుల పల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుండి హల్దీ కాలువ లోకి గోదావరి జలాల విడుదల చేయనున్న సీఎం.. ఉదయం 11.15 గంటల కు మర్కుక్ మండలం పాముల పర్తి గ్రామంలో గోదావరి జలాలను గజ్వేల్ కాలువ లోకి గోదావరి జలాలను విడుదల చేస్తారని వెల్లడించారు.

చెక్ డాం లలో 0.62 TMC ల నీరు నిల్వ ఉంది. గోదావరి జలాల విడుదలతో వేసవి కాలంలో 14 వేల 268 ఎకరాల లోని వరి పంటను కాపాడ కొగలుగుతాం అని హరీష్ రావు అన్నారు. రైతుల దశ, దిశ మార్చే సందర్భం ఇది అని పేర్కొన్నారు.

హల్దీ కాలువ లోకి 1600 క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో 8 నుంచి 10 రోజుల్లో హల్దీ, మంజీర నుండి నిజాం సాగర్ లోకి గోదావరి జలాలు చేరుతాయి. హల్దీ, మంజీర నుండి నిజాం సాగర్ లోకి గోదావరి జలాల విడుదలతో 32 చెక్ డ్యాం లు నిండనున్నాయి.

- Advertisement -